![]() |
![]() |
.webp)
మెగాభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా `ఆచార్య`. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ క్రేజీ మల్టిస్టారర్ ని వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ రూపొందించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందించిన ఈ సోషల్ డ్రామా.. వేసవి కానుకగా ఏప్రిల్ 29న జనం ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే, `ఆచార్య` ట్రైలర్ త్వరలోనే రిలీజ్ కాబోతున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. శ్రీరామ నవమి కానుకగా ఏప్రిల్ 10న `ఆచార్య` ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారట. అతి త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది. మరి.. భారీ అంచనాల నడుమ విడుదల కానున్న ఈ ట్రైలర్.. యూట్యూబ్ ముంగిట ఎలాంటి సంచలనాలు, రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
కాగా, `ఆచార్య`లో చిరంజీవికి జంటగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ సందడి చేయనుండగా, రామ్ చరణ్ కి జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే ఎంటర్టైన్ చేయనుంది. రెజీనా ఓ ప్రత్యేక గీతంలో చిందులేసిన ఈ సినిమాలో సోనూ సూద్, ప్రకాశ్ రాజ్, సంగీత ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
![]() |
![]() |