![]() |
![]() |

యువ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా 'బేబీ'. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్‌కేఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మంగళవారం ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్‌లో వాడిన రోజా పువ్వును హీరో ఆనంద్ దేవరకొండ పట్టుకుని తీక్షణంగా చూస్తున్నారు. తను ప్రేమించిన యువతికి రోజ్ ఫ్లవర్ ఇస్తూ ఆమె స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఓల్డ్ రోజ్ ఫ్లవర్ వెనక దాగి ఉన్న కథేంటి అనేది సినిమాలో చూడాలి. ఈ పోస్టర్ తో ఆనంద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు టీమ్ మెంబర్స్. న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న 'బేబీ' మూవీ ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది.
ఈ చిత్రానికి, సంగీతం: విజయ్ బుల్గానిన్, సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి, ఎడిటింగ్: ఎం.ఆర్. వర్మ, ఆర్ట్: సురేష్, సహ నిర్మాత: ధీరజ్ మొగిలినేని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దాసరి వెంకట సతీష్, రచన, దర్శకత్వం: సాయి రాజేష్.

![]() |
![]() |