![]() |
![]() |

ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ పీవీ సింధు నుండి త్వరలో ఓ వెబ్ సిరీస్ రాబోతోంది. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌గా నిలిచిన ఈ తెలుగమ్మాయి స్పోర్ట్స్ వెబ్ సిరీస్ 'ది ఏ-గేమ్'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. రెగ్యులర్ వెబ్ సిరీస్ లకు డిఫరెంట్ సిరీస్ ఇది. జస్ట్ ఇంటర్వ్యూలు చేయడం టైపు అనుకోవచ్చు.
క్రీడా ప్రేమికుల కోసం దేశంలోని గొప్ప గొప్ప క్రీడాకారుల సక్సెస్ స్టోరీలను 'ఏ-గేమ్'లో వినిపించనున్నారు. బ్యాడ్మింటన్ క్రీడల్లో మాత్రమే కాకుండా, అన్ని క్రీడా రంగాల్లో ప్రముఖులను ఈ షోకి తీసుకువస్తారట. ఆల్రెడీ కామన్ వెల్త్, ఒలింపిక్ గేమ్స్ కోసం దేశవిదేశాలకు వెళ్లిన పీవీ సింధుకు గొప్ప గొప్ప క్రీడాకారులు అందరూ పరిచయమే. గతంలో వాళ్ళతో మాట్లాడిన, వాళ్ళ కథలు విన్న అనుభవం ఉంది. ఇప్పుడు ప్రేక్షకుల కోసం మరింత లోతుగా గొప్ప గొప్ప క్రీడాకారుల జీవితాలను ఆవిష్కరించనున్నారు.
![]() |
![]() |