![]() |
![]() |
.jpg)
అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'కౌన్ బనేగా క్రోర్‌పతి' గేమ్ షో ఈ రోజు రాత్రి మొదలవుతోంది. కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ పన్నెండవ సీజన్‌లో చిన్నపాటి మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. స్టూడియోలో ప్రేక్షకులనేవాళ్లు లేకుండా అమితాబ్ హోస్ట్‌గా చేస్తున్న తొలి సీజన్ ఇదే. అవును. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఏడాది స్టూడియో ప్రేక్షకులు లేకుండానే ఈ సీజన్‌ను మనం చూడబోతున్నాం.
'ఆడియెన్స్ పోల్స్' మినహాయిస్తే, మిగతా రూల్స్ ఏవీ మారలేదు. ఇప్పటిదాకా కంటెస్టెంట్లు లైఫ్‌లైన్‌ను వాడుకొనే సందర్భంలో స్టూడియోలో ఉన్న ప్రేక్షకుల సాయం తీసుకొనేవాళ్లు. ఈసారి ఆ లైఫ్‌లైన్ కనిపించదు. 'ఆడియెన్స్ పోల్'కు బదులుగా 'వీడియో ఎ ఫ్రెండ్' అనే ఆప్షన్‌ను నిర్వాహకులు ప్రవేశపెట్టారు. మిగతా మూడు లైఫ్‌లైన్లు 50:50, ఫ్లిప్ ద క్వశ్చన్, ఆస్క్ ద ఎక్స్‌పర్ట్ అనేవాటిని ఎప్పటిలా కంటెస్టెంట్లు ఉపయోగించుకోవచ్చు.
.jpg)
ప్రతి సీజన్ మాదిరిగానే 'కౌన్ బనేగా క్రోర్‌పతి 12' సోనీ టీవీ చానల్‌లో ప్రసారమవుతోంది. దీంతో పాటు సోనీలైవ్ యాప్‌లోనూ, సోనీలైవ్ డాట్ కామ్‌లోనూ ఈ షోను వీక్షించవచ్చు. సోనీలైవ్ యాప్‌లో చూడాలనుకొనేవారు చందాదారులు కావడం తప్పనిసరి. ఎయిర్‌టెట్ టీవీ, జియో టీవీలో ఉచితంగా ఈ షో స్ట్రీమ్ అవుతుంది.
![]() |
![]() |