![]() |
![]() |

తమిళనాడులో ఆకతాయిలు పోలీసుల సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. ఫలానా హీరో ఆఫీసులో లేదా ఇంటి దగ్గర బాంబు పెట్టామని బెదిరిస్తూ ఫోన్లు చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ హీరోలు అజిత్, విజయ్, ప్రముఖ దర్శకుడు మణిరత్నం తదితరుల ఇల్లు ఆఫీసులో బాంబులు పెట్టమని పోలీసులకు ఫోన్లు చేశారు. హైరానా పడుతూ పోలీసులు వెళ్లడం, చెకింగులు చేయడం... చివరకు అది ఫేక్ అని తేలడంతో చెన్నైలో సర్వసాధారణంగా మారింది.
తాజాగా సూర్య బాంబు పెట్టామని బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో పోలీసులు ఉరుకులు పరుగులు తీశారు. చివరకు అది కూడా ఫేక్ కాల్ అని తేలింది. అది తెలుసుకోవడానికి పోలీసులు చెన్నై లోని ఆదివారం పేట ప్రాంతంలోని సూర్య ఆఫీస్ కి వెళ్లి చెకింగులు చేయాల్సి వచ్చింది. ఈ ఘటన పట్ల సోషల్ మీడియాలో కొందరు స్పందిస్తున్నారు. ప్రజలు బాధ్యతాయుతంగా మెలగాలని పోలీసుల సమయం వృధా చేయకూడదని చెబుతున్నారు.
![]() |
![]() |