![]() |
![]() |

పలు దశాబ్దాల పాటు హిందీ చిత్రసీమను తమ గాన మాధుర్యంతో ఓలలాడించారు అక్కాచెల్లెళ్లయిన లెజెండరీ సింగర్స్ అతా మంగేష్కర్, ఆశా భోస్లే. పరస్పరం ఎంతో అనుబంధాన్నీ, ఆత్మీయతనూ వారు పంచుకుంటూ ఉంటారు. చిన్నతనంలో చెల్లెలు ఆశాను వెంటబెట్టుకొని స్కూలుకు వెళ్తుండేవారు లత. ఒకసారి ఆశాను తీసుకురావద్దని టీచర్ మందలించడంతో చదువునే ఆపేయాలని నిర్ణయించుకున్నారు లత. ఆమె పద్నాలుగేళ్ల వయసులో తండ్రి చనిపోవడంతో, కుటుంబ బాధ్యతను తీసుకొని పాడటం ప్రారంభించారు. అప్పట్నుంచీ ఆమె వెనుతిరిగి చూసుకున్నది లేదు.

సెప్టెంబర్ 28 లతా మంగేష్కర్ 91వ జన్మదినం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆశా భోస్లే అక్కకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక అందమైన నోట్ రాశారు. చిన్ననాటి ఫొటో ఒకటి పోస్ట్ చేసిన ఆమె, "ఇవాళ్టితో 91 నిండుతున్న లత అక్కకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ పిక్చర్ ద్వారా మా బాల్యాన్ని గుర్తు చేసుకుంటున్నాను. అందులో లత అక్క ఎడమవైపు కూర్చొని ఉండగా, ఆమె వెనుక మీనా అక్క, నేను నిలుచున్నాం" అని రాశారు.

![]() |
![]() |