![]() |
![]() |

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, `కేజీఎఫ్` కెప్టెన్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో యాక్షన్ సాగా `సలార్` రూపొందుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. 2022 ఏప్రిల్ 14న థియేటర్స్ లోకి రానుంది. ఈ లోపే.. వీరిద్దరి కాంబోలో మరో చిత్రం కన్ఫామ్ అయిందని టాక్.
ఆ వివరాల్లోకి వెళితే.. `మిస్టర్ పర్ ఫెక్ట్` (2011) తరువాత ప్రభాస్ తో సినిమా చేయాలని చాన్నాళ్ళుగా ప్లాన్ చేస్తున్నారు ప్రముఖ నిర్మాత `దిల్` రాజు. ఈ నేపథ్యంలో.. కొన్నాళ్ళ క్రితమే ప్రభాస్ కి భారీ మొత్తాన్నే అడ్వాన్స్ గా కూడా ఇచ్చారట. అయితే, సరైన దర్శకుడు దొరకకపోవడం - ప్రభాస్ వేర్వేరు చిత్రాలతో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు `దిల్` రాజుకి ఆ సరైన దర్శకుడు దొరికాడట. ఆ దర్శకుడు మరెవరో కాదు.. ప్రశాంత్ నీల్. ఇప్పటికే `సలార్` షూటింగ్ టైమ్ లో ప్రశాంత్ విజన్ కి ఫిదా అయిన ప్రభాస్ కూడా.. మరోమారు `కేజీఎఫ్` కెప్టెన్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే.. ప్రభాస్ - ప్రశాంత్ - దిల్ రాజు ప్రాజెక్ట్ సెట్ అయిందని బజ్.
అటు ప్రభాస్, ఇటు ప్రశాంత్.. ఇద్దరు కూడా వేర్వేరు కమిట్ మెంట్స్ తో బిజీబిజీగా ఉండడంతో.. 2023లో ఈ భారీ బడ్జెట్ మూవీ పట్టాలెక్కే అవకాశముందంటున్నారు. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి ఫుల్ క్లారిటీ రావచ్చు.
![]() |
![]() |