![]() |
![]() |

మాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ `దృశ్యం`కి సీక్వెల్ గా రూపొందిన చిత్రం `దృశ్యం 2`. గత నెలలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయిన ఈ పర్ ఫెక్ట్ సీక్వెల్ కి అటు విమర్శకుల నుంచి, ఇటు వీక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సీక్వెల్.. ఇప్పుడు తెలుగులో రీమేక్ అవుతోంది. `దృశ్యం` రీమేక్ లో నటించిన విక్టరీ వెంకటేశ్ నే.. `దృశ్యం 2`లోనూ కొనసాగుతున్నారు. వెంకీకి జంటగా మీనా నటిస్తున్న ఈ సినిమాని మాతృక దర్శకుడు జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. `దృశ్యం 2` రీమేక్ లో కొన్ని కొత్త సన్నివేశాలను జోడిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి.. ఒరిజినల్ వెర్షన్ కోసమే ఈ సీన్స్ డిజైన్ చేసుకున్నప్పటికీ.. లాక్ డౌన్ కారణంగా షూట్ చేయలేకపోయారట దర్శకుడు. ఈ నేపథ్యంలోనే.. జీతూ తెలుగు రీమేక్ కి ఆయా సన్నివేశాలను యాడ్ చేస్తున్నారట. ఇందుకు వెంకీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. సో.. ఒకవేళ మలయాళ వెర్షన్ చూసినప్పటికీ తెలుగు వెర్షన్ లో వారికి సర్ ప్రైజెస్ ఉంటాయన్నమాట.
కాగా నదియా, నరేశ్, ఎస్తేర్ అనిల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న `దృశ్యం 2`ని జూన్ లేదా జూలైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
![]() |
![]() |