![]() |
![]() |

బాలనటుడిగా పరిచయమై ఆనక కథానాయకుడిగా అవతారమెత్తాడు తరుణ్. హీరోగా నటించిన తొలి చిత్రం `నువ్వే కావాలి` (2000)తోనే సంచలన విజయం అందుకున్న ఈ టాలెంటెడ్ యాక్టర్.. ఆపై `ప్రియమైన నీకు`, `నువ్వు లేక నేను లేను`, `నువ్వే నువ్వే` వంటి సినిమాలతో అలరించాడు. ఆ తరువాత ట్రాక్ తప్పిన తరుణ్.. చివరగా `ఇది నా లవ్ స్టోరీ` (2018)లో కనిపించాడు. అనంతరం మళ్ళీ తెరపై సందడి చేయని తరుణ్.. ఇప్పుడు కమ్ బ్యాక్ ఫిల్మ్ కి ప్లాన్ చేస్తున్నాడట.
ఆ వివరాల్లోకి వెళితే.. తనకున్న లవర్ బాయ్ ఇమేజ్ కి తగ్గట్టుగానే ఇటీవల తన స్నేహితుడు చెప్పిన ఓ న్యూ ఏజ్ లవ్ స్టోరి నచ్చడంతో.. వెంటనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట తరుణ్. అంతేకాదు.. ఈ చిత్రం కోసం సరికొత్త లుక్ లో దర్శనమివ్వబోతున్నాడట. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోందని.. త్వరలోనే యూనిట్ సెట్స్ పైకి వెళ్ళనుందని వినికిడి. మరి.. ఫ్రెండ్ దర్శకత్వంలో తరుణ్ చేయనున్న ఈ ప్రయత్నం.. అతణ్ణి మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువస్తుందేమో చూడాలి.
hero tarun re entry with different story,hero tarun re entry,tarun reentry in film industry,Senior Hero Tarun Re Entry,Nuvve Nuvve, Nuvve Kavali, Aditya 369
![]() |
![]() |