![]() |
![]() |

ఈ శుక్రవారం థియేటర్స్ లో సందడి చేయనున్న చిత్రాల్లో `రంగ్ దే` ఒకటి. నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. పాటలు, ప్రచార చిత్రాలతో యువతరాన్ని బాగానే ఆకట్టుకున్న `రంగ్ దే`.. సినిమాగా ఏ స్థాయిలో మెప్పిస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే.. `రంగ్ దే` విజయం ఈ టీమ్ లో ముగ్గురికి ఎంతో కీలకంగా మారింది. ఆ ముగ్గురు మరెవరో కాదు.. కథానాయకుడు నితిన్, కథానాయిక కీర్తి సురేశ్, దర్శకుడు వెంకీ అట్లూరి. గత ఏడాది `భీష్మ`తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన నితిన్.. రీసెంట్ గా రిలీజైన `చెక్`తో మరోమారు గాడి తప్పాడు. ఈ నేపథ్యంలో.. `రంగ్ దే` విజయం సాధించడం అతని కెరీర్ కి ఎంతో ముఖ్యం. ఇక `మహానటి` తరువాత హీరోయిన్ గా మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోలేకపోయింది కీర్తి. అలాగే `తొలిప్రేమ`తో దర్శకుడిగా శుభారంభం చూసిన వెంకీ అట్లూరి కూడా `మిస్టర్ మజ్ను`తో ట్రాక్ తప్పాడు. దీంతో.. `రంగ్ దే` సక్సెస్ కావడం.. ఈ ముగ్గురికి ఎంతో కీలకంగా మారింది.
మరి.. ఈ నెల 26న రానున్న `రంగ్ దే` ఈ ముగ్గురినీ మళ్ళీ విజయపథంలోకి తీసుకువస్తుందేమో చూడాలి.
సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన `రంగ్ దే`కి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించారు.
![]() |
![]() |