![]() |
![]() |

టాలీవుడ్ తారల్లో తమన్నా అందమే వేరు. పాల మీగడ అందం ఆమెది! అందుకే మిల్కీ బ్యూటీ అనే పేరు పెట్టేశారు ఫ్యాన్స్. కొంత కాలం క్రితం కెరీర్‌లో కాస్త డౌన్‌లో ఉన్న ఆమె బ్లాక్‌బస్టర్ మూవీ 'ఎఫ్2' తర్వాత వరుసగా అవకాశాలు పొందుతూ వస్తున్నారు. ఇటీవల ఆమె కొవిడ్ 19 బారినపడి కోలుకున్నారు. లాక్‌డౌన్ పీరియడ్‌లో కాస్త బొద్దుగా మారిన ఆమె వర్కవుట్స్‌తో తిరిగి తన పూర్వ రూపానికి వచ్చేశారు. ఆ విషయం శుక్రవారం రాత్రి జరిగిన ఆహా ప్రోగ్రామ్‌లో వెల్లడైంది. ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు ఆమె 'లెవెన్త్ అవర్' (11th Hour) అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు.
పర్పుల్ కలర్ శారీ, మ్యాచింగ్ బ్లౌజ్‌తో ఆమె మెరిసిపోయారు. ఆ ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసుకున్నారు. తను ధరించిన శారీ, బ్లౌజ్, జ్యుయెలరీ అన్నీ ప్రఖ్యాత డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసినవని ఆమె తెలిపారు. ఆ డ్రస్‌లో ఆమెను చూస్తుంటే చూపు తిప్పుకోవడం కష్టమన్నట్లే ఉన్నాయి ఆమె రూప లావణ్యాలు.
'లెవెన్త్ అవర్' వెబ్ సిరీస్‌కు 'పీఎస్‌వీ గరుడవేగ' ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకుడు. త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నది. ఇటీవలే ఈ సిరీస్ ఫస్ట్ లుక్‌లో మెరిశారు తమన్నా.


![]() |
![]() |