![]() |
![]() |

బహుశా భాగ్యనగరం (హైదరాబాద్)కి వచ్చే నెలలో వస్తానేమో అని 'ఆర్ఎక్స్ 100' పాప పాయల్ రాజ్‌పుత్ ఆశాభావం వ్యక్తం చేసింది. లాక్‌డౌన్ విధించడానికి కొన్ని రోజుల ముందు ఈ హీరోయిన్ ముంబై వెళ్లింది. ముంబైలో పాయల్, ఢిల్లీలో ఆమె తల్లితండ్రులు... లాక్ అయిపోయారు. సుమారు రెండున్నర నెలలకు లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన తరవాత ఢిల్లీలో తల్లితండ్రుల దగ్గరకు వెళ్లారు. ప్రస్తుతం పాయల్ చేతిలో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. కొన్ని రోజులు షూటింగ్ చేస్తే '5డబ్ల్యూస్' కంప్లీట్ అవుతుంది. మరో సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. షూటింగులకు అనుమతులు వచ్చినప్పటికీ... ఆమె నటిస్తున్న సినిమాలు ఇప్పట్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. అందుకని, వచ్చే నెలలో హైదరాబాద్ రావొచ్చని పాయల్ అంటున్నారు.
ఈ ఏడాది పంజాబీ సినిమాల్లోనూ తప్పకుండా నటిస్తానని పాయల్ అంటున్నారు. ఆమె పంజాబీయే. ఢిల్లీలో సెటిలైన పంజాబీ ఫ్యామిలీ. పంజాబీలో నటించిన 'చెన్నా మేరియా' సినిమాకి ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. 'ఆర్ఎక్స్ 100' తరవాత తెలుగులో బిజీ కావడంతో పంజాబీలో సినిమాలు చేయలేదు.
![]() |
![]() |