![]() |
![]() |

ప్రభాస్ 'మిర్చి', పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది', నితిన్ 'అ ఆ' సినిమాల్లో తన నటన, ఆహార్యంతో ఆయా పాత్రలకు నదియా ప్రాణం పోశారు. హుందాతనం తీసుకొచ్చారు. 'బాహుబలి'లో శివగామిగా రమ్యకృష్ణ ఆహార్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం తెలుగులో పవర్‌ఫుల్ ఫిమేల్ క్యారెక్టర్లకు వీళ్లిద్దర్నీ తీసుకోవాలని హీరోలు, దర్శకులు, నిర్మాతలు భావిస్తున్నారు. నితిన్ హీరోగా కృష్ణచైతన్య దర్శకత్వం వహించనున్న 'పవర్ పేట'లోనూ వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు నటించే అవకాశం ఉంది.
రాజకీయాల నేపథ్యంలో ఫిక్షనల్ బయోపిక్‌గా 'పవర్ పేట'ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఓ పవర్ ఫుల్ ఫిమేల్ రోల్ ఉంది. దానికి నదియాను తీసుకోవాలని దర్శకుడు కృష్ణచైతన్య భావిస్తున్నారు. ఆల్రెడీ ఆమెకు కథ చెప్పారు. కథ నచ్చిందని చెప్పిన నదియా... ఇతర సినిమాల డేట్స్ చూసుకుని ఏ విషయం చెబుతానని చెప్పారట. ఒకవేళ నదియా డేట్స్ అడ్జస్ట్ కాకపోతే రమ్యకృష్ణను సంప్రదించాలని అనుకుంటున్నారట.
![]() |
![]() |