![]() |
![]() |

మల్టీస్టారర్ మలయాళ సినిమా 'అయ్యప్పన్ కోషియమ్' తెలుగు రీమేక్‌లో నందమూరి బాలకృష్ణ నటిస్తారా? లేదా? కొన్ని రోజులు చర్చ జరిగింది. తరవాత రవితేజ, రానా దగ్గుబాటి ఆ చిత్రం చేస్తున్నారని ఫిలింనగర్ వర్గాల్లో బలంగా వినిపించింది. ఇప్పుడు సంగతి ఎందుకంటే? ఆ చిత్రానికి దర్శకత్వం వహించినది సచిదానందన్. మలయాళ పరిశ్రమలో అతడిని సచి అని పిలుస్తారు. గురువారం రాత్రి త్రిశూర్ లోని జూబ్లీ మెన్షన్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. మంగళవారం హార్ట్ ఎట్టాక్ రావడంతో అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. తరవాత బ్రెయిన్ కి సంబంధించిన సమస్యలు కూడా ఉన్నట్టు తెలిసింది. మరో ఆసుపత్రిలో హిప్ సర్జరీ చేయించుకున్న తరవాత సచికి హార్ట్ ఎటాక్ వచ్చినట్టు సమాచారం.
పవన్ కళ్యాణ్ రీమేక్ చేయవచ్చని వినిపించిన 'డ్రైవింగ్ లైసెన్స్'కి సచి రచయిత. అంతకు ముందు 'చాకోలెట్', 'మేకప్ మాన్', 'రాబిన్ హుడ్', 'సీనియర్స్' సినిమాలకు రచయితగా పని చేశారు. పృథ్వీరాజ్ నటించిన 'అనార్కలి'తో దర్శకుడిగా మారారు. 'అయ్యప్పన్ కోషియమ్' అతడికి పేరు తీసుకొచ్చింది. సచిదానందన్ మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
![]() |
![]() |