![]() |
![]() |

కీర్తి సురేష్ కెరీర్ గురించి చెప్పుకోవాల్సి వస్తే... 'మహానటి' ముందు, 'మహానటి' తర్వాత అని చెప్పుకోవాలి. ఆ సినిమాలో అలనాటి మేటి నటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించారు. ఆమె నటనకు నేషనల్ అవార్డు వచ్చింది. నటిగా కీర్తి సురేష్ కీర్తి పెరగడంతో పాటు వెళ్ళు వల్ల అవకాశాలు వచ్చాయి. వేరొకరు అయితే అన్ని అవకాశాలు వచ్చినందుకు ఎగిరి గంతులు వేసే వారేమో. కీర్తి సురేష్ మాత్రం సంతోషంగా ఫీల్ అవ్వలేదు.
'మహానటి' తర్వాత వచ్చిన కథల్లో చాలా వాటిని ఆమె రిజెక్ట్ చేశారు. "నాకు మహానటి తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. అయితే అందులో సుమారు 20 కథల వరకూ రిజెక్ట్ చేశా. వచ్చిన కథల్లో ఎక్కువశాతం ఫిమేల్ సెంట్రిక్ ఫిలిమ్స్ ఉన్నాయి. నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత వైవిధ్యమైన కథలను ఎంచుకోవాలని నేను అనుకున్నాను" అని తాజా ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ తెలిపారు.
తెలుగులో నితిన్ సరసన 'రంగ్ దే', నగేష్ కుకునూర్ దర్శకత్వంలో 'గుడ్ లక్ సఖి', మహేష్ కోనేరు నిర్మాణంలో 'మిస్ ఇండియా' సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్, తమిళంలో రజనీకాంత్ సినిమా 'అన్నాత్తే'లో రజనీ కుమార్తె పాత్ర చేస్తున్నారు. ఆ సినిమా తనకెంతో స్పెషల్ అని ఆమె అన్నారు.
![]() |
![]() |