![]() |
![]() |

"మన తెలుగు అమ్మాయిలు తలుచుకోవాలే గానీ.... ఒక్కసారి తలుచుకుంటే హాలీవుడ్ హీరోయిన్ల కంటే బాగుంటారు" అని బుల్లితెర జబర్దస్త్ యాంకర్, వెండితెర రంగమ్మత్త అలియాస్ అనసూయ భరద్వాజ్ అన్నారు. ఈ స్టేట్మెంట్ ఇవ్వడం వెనక ఓ కారణం ఉంది. అదేంటంటే...
రీసెంట్ గా అనసూయ హెయిర్ కట్ చేయించుకున్నారు. షార్ట్ హెయిర్ తో, కొంచెం బేబీ కట్ తో కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేశారు. అది చూసిన నెటిజన్లు అనసూయ అందం మరింత పెరిగిందని కాంప్లిమెంట్స్ ఇచ్చారు.
ఓ మీమ్ మేకర్ ఒక అడుగు ముందుకేసి... "అనసూయ నా? నేను ఇంకా ఎవరో ఇంగ్లీష్ సినిమాలో హీరోయిన్ అనుకున్నాను" అని పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చాడు. బదులుగా అనసూయ "మన తెలుగు అమ్మాయిలు/ఆడవారు తలుచుకుంటే వారి కంటే (హాలీవుడ్ హీరోయిన్లు) బాగుంటారు. మీరు కొంచెం దృష్టి సారించాలి. అంతే" అని అన్నారు. వచ్చే వారం నుండి మళ్లీ బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా సందడి చేయడానికి అనసూయ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
![]() |
![]() |