![]() |
![]() |

మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. జూన్ 17 న 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్న రవితేజ.. ప్రస్తుతం 'ధమాకా', 'రావణాసుర' సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాగే త్వరలో 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాని కూడా పట్టాలెక్కించబోతున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి కీలక అప్డేట్స్ వచ్చాయి.
స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి 'దొంగాట' ఫేమ్ వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమా ఉగాది సందర్భంగా ఏప్రిల్ 2 న మధ్యాహ్నం 12:06 కి పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. అదే సమయానికి మూవీకి సంబంధించి ప్రీలుక్ ని కూడా విడుదల చేయనున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా నుపూర్ సనన్ నటించనుందని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. నుపూర్ సనన్ ఎవరో కాదు హీరోయిన్ కృతి సనన్ సోదరి. '1 నేనొక్కడినే' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన కృతి పలు హిందీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో 'ఆదిపురుష్'తో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు రవితేజ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమవుతున్న కృతి సోదరి నుపూర్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
'టైగర్ నాగేశ్వరరావు' పాన్ ఇండియా రేంజ్ లో రూపొందనుంది. ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ , మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.
![]() |
![]() |