![]() |
![]() |

ఖైదీ నంబర్ 150 వంటి బ్లాక్ బస్టర్ తరువాత మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఆచార్య. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఈ సోషల్ డ్రామాని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. కరోనా ఎఫెక్ట్ తో చిత్రీకరణకు విరామమిచ్చిన యూనిట్.. ఇటీవలే మళ్ళీ షూటింగ్ ని ప్రారంభించింది. త్వరలోనే చిరు చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు. కాగా, ఇప్పటివరకు ఆచార్య షూటింగ్ లో జాయిన్ కాని కాజల్.. జనవరి నెలలో రాజస్థాన్ లో ప్రారంభమయ్యే షెడ్యూల్ లో పాల్గొంటారని సమాచారం. ఈ షెడ్యూల్ లో చిరు, కాజల్ పై కొన్ని సన్నివేశాలతో పాటు ఒక పాటని కూడా చిత్రీకరిస్తారని వినికిడి.
ఖైదీ నంబర్ 150లో చిరు సరసన మెస్మరైజ్ చేసిన కాజల్.. ఆచార్యతోనూ ఆ పరంపరని కొనసాగిస్తారేమో చూడాలి.
![]() |
![]() |