![]() |
![]() |

'అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ' సినిమా సెట్స్‌పై పరస్పరం ప్రేమలో పడ్డారు కత్రినా కైఫ్, రణబీర్ కపూర్. అతని ప్రేమ కోసం సల్మాన్ ఖాన్‌తో అనుబంధాన్ని తెంచుకుంది కత్రినా. కానీ రణబీర్‌తో ఆమె బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. మొదట ఆ ఇద్దరూ విడదీయలేనంత ప్రేమపక్షుల్లా కనిపించారు. 'కాఫీ విత్ కరణ్' ప్రోగ్రామ్‌లో పాల్గొన్నప్పుడు తమ పెళ్లి ప్రస్తావన కూడా తీసుకొచ్చింది కత్రినా. కానీ అది జరగలేదు. చాలా కాలం క్రితమే ఆ ఇద్దరూ విడిపోయారు. ఇప్పటికీ కత్రినా సింగిల్‌గానే ఉండగా, అలియా భట్‌తో అనుబంధాన్ని ఏర్పరచుకున్నాడు రణబీర్.
ఈమధ్య వోగ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణబీర్‌తో తన బ్రేకప్ విషయంపై మాట్లాడింది కత్రినా. "దాన్ని (బ్రేకప్‌ను) నేనిప్పుడు ఓ బ్లెస్సింగ్‌గా భావిస్తున్నా. ఎందుకంటే నా మార్గాలు, నా ఆలోచనా ప్రక్రియలు, నా మొత్తం జీవితంలో చాలా కచ్చితంగా ఉండే విషయాలేమిటనే దాన్ని గుర్తించగలుతుతున్నా. వాటిని పూర్తిగా భిన్న కోణంలో చూడగలుతున్నా" అని ఆమె చెప్పింది.
అంతేకాదు, నిజంగా తనేమిటనే విషయంపై దృష్టి సారించడం ఇదే తొలిసారి అని కూడా కత్రినా తెలిపింది. "మనపై మనం దృష్టి పెట్టినప్పుడు, నిజంగా మనమేమిటనే విషయం మనకు తెలీదని గ్రహిస్తాం. మన గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఒక్కొక్క నిజం మనముందుకు వస్తూ, మనం ఏమిటనే విషయం నిజంగా మనకు తెలీదని ఒప్పుకుంటాం" అని చెప్పింది కత్రినా.
![]() |
![]() |