![]() |
![]() |

ఒకవైపు బోయపాటి శ్రీను సినిమా చేస్తూనే.. మరోవైపు కొత్త చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు నటసింహ నందమూరి బాలకృష్ణ. బోయపాటి కాంబినేషన్ ఫిల్మ్ తరువాత తన లక్కీ డైరెక్టర్స్ లో ఒకరైన బి. గోపాల్ తో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేయబోతున్నారు బాలయ్య. ఆపై డిక్టేటర్ ఫేమ్ శ్రీవాస్ దర్శకత్వంలోనూ మరో సినిమా చేయబోతున్నారు. అలాగే.. కందిరీగ, రభస, హైపర్ చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ లోనూ ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. అంతేకాదు.. ఈ సినిమాకి బలరామయ్య బరిలోకి దిగితే అనే టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించినట్లు ప్రచారం సాగుతోంది.
బాలయ్యకి ఇమేజ్ తగ్గట్టు ఈ సినిమా ఉంటుందని.. ప్రస్తుతం అల్లుడు అదుర్స్ చిత్రంతో బిజీగా ఉన్న సంతోష్ శ్రీనివాస్.. ఆ సినిమా పూర్తవగానే బాలయ్య కాంబో మూవీపై దృష్టి సారిస్తారని వినికిడి.
మరి.. నందమూరి అబ్బాయ్ యంగ్ టైగర్ యన్టీఆర్ కాంబినేషన్ లో సక్సెస్ అందుకోలేకపోయిన సంతోష్ శ్రీనివాస్.. నందమూరి బాబాయ్ బాలయ్య తోనైనా ఆ లోటు తీర్చుకుంటారేమో చూడాలి.
![]() |
![]() |