![]() |
![]() |

నాగబాబు ముద్దుల తనయ నిహారిక నిజ జీవితంలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో, సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా ఉంటుంది. మొదట టీవీ హోస్ట్‌గా, తర్వాత సినిమా హీరోయిన్‌గా కనిపించింది నిహారిక. సినిమాల్లో సక్సెస్‌ను పొందలేకపోయిన ఆమె, పాండమిక్ టైమ్‌లో చైతన్య జొన్నలగడ్డను పెళ్లాడి జీవితంలో స్థిరపడింది. అలా అని తనలోని ఆసక్తిని అణచుకోలేదు. వెబ్ సిరిస్‌లతో బిజీగా మారింది. ఇటీవల సంతోష్ శోభన్, సిమ్రాన్ శర్మ ప్రధాన పాత్రధారులుగా 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' అనే సిరీస్‌ను నిర్మించి జీ5లో రిలీజ్ చేసింది.
అంతే కాదు, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఫొటోల రూపంలోనో, వీడియోల రూపంలోనో ఇస్తూ పాపులారిటీ పెంచుకుంది. తద్వారా ఆమెకు లక్షలాది మంది ఫాలోయర్స్ లభించారు. అలాంటిది.. ఉన్నట్లుంది నిహారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మాయమైంది. దీనికి కారణమేంటా అని ఆమె అభిమానులంతా ఆశ్చర్యపోతున్నారు. చూస్తుంటే.. ఆమె తన అకౌంట్‌ను డియాక్టివేట్ చేసిందని అర్థమవుతోంది.
నిహారిక ఇటీవల ఓ వీడియోను షేర్ చేసిందనీ, దానిపై బాగా ట్రోలింగ్ నడిచిందనీ తెలుస్తోంది. దీంతో హర్టయిన నిహారిక తన అకౌంట్‌ను ఉపసంహరించుకుందని వినిపిస్తోంది. నిజమైన కారణమేమిటనేది మాత్రం తెలియలేదు.
![]() |
![]() |