![]() |
![]() |

క్రికెట్ ఆటగాళ్ళు 35 ఏళ్ల వయస్సు వచ్చిందంటే రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఉంటారు. క్రికెట్ గాడ్ గా పేరొందిన సచిన్ టెండూల్కర్ 38 ఏళ్ల వయస్సులో రిటైర్మెంట్ ప్రకటించాడు. 40 ఏళ్ళు వస్తే దాదాపు అందరూ ఆటగాళ్ళు ఆటకు దూరమవుతుంటారు. కానీ ఒక్క ఆటగాడు మాత్రం 41 వయస్సులో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు. అతనే ప్రవీన్ తాంబే.
41 ఏళ్ల వయస్సులో ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రవీన్ తాంబే. ఆయన జీవిత కథ ఆధారంగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ బయోపిక్ కి తెలుగులో 'ప్రవీన్ తాంబే ఎవరు?' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ బయోపిక్ లో ప్రవీన్ తాంబే పాత్రలో శ్రేయాస్ తల్పడే కనిపించనున్నాడు.

హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్ ను మార్చి 9 న రిలీజ్ చేస్తామని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఏప్రిల్ 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
![]() |
![]() |