![]() |
![]() |

పాపులర్ తమిళ దర్శకుడు బాలా, ఆయన భార్య ముత్తుమలార్ మార్చి 5న ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకున్నారు. అందిన సమాచారం ప్రకారం నాలుగేళ్ల నుంచీ వారు వేర్వేరుగా ఉంటున్నారు. పరస్పర అంగీకారంతో బాలా, మలార్ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ ఇద్దరికీ ప్రార్థన అనే కూమార్తె ఉంది. బాలా, మలార్ డివోర్స్ తీసుకున్నారనే వార్త ఇండస్ట్రీలోని వారందరికీ షాక్ కలిగించింది.
పని విషయానికి వస్తే, సూర్య హీరోగా ఓ సినిమాని డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు బాలా. అయితే, వ్యక్తిగత జీవితానికి వస్తే భార్యకు విడాకులు ఇవ్వడం ద్వారా క్లిష్ట స్థితిని ఎదుర్కొంటున్నారు. మార్చి 5న ఒక ఫ్యామిలీ కోర్టు ఆ దంపతులకు విడాకులు మంజూరు చేసింది.
కొన్నేళ్ల క్రితమే బాలా, మలార్ మధ్య విభేదాలు తలెత్తాయని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. దానివల్లే వారు నాలుగేళ్ల నుంచీ విడివిడిగా ఉంటున్నారు. బాలా తన పనిపై దృష్టి పెట్టగా, మలార్ ఇండస్ట్రీలోని తన స్నేహితులతో కలిసి కనిపిస్తూ వస్తున్నారు. ఆమె స్నేహితుల్లో జయం రవి భార్య ఆర్తి, సింగర్ సైంధవి లాంటి వాళ్లున్నారు. మదురైలో 2004 జూలై 5న సంప్రదాయబద్ధంగా బాలా, మలార్ పెళ్లి చేసుకున్నారు. 17 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం విడిపోయారు.
'సేతు' (తెలుగులో 'శేషు'), 'నందా', 'పితామగన్' (శివపుత్రుడు), 'నాన్ కడవుల్', 'అవన్ ఇవన్' (వాడు వీడు) లాంటి రియలిస్టిక్, డార్క్ మూవీస్ ద్వారా బాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. 'నాన్ కడవుల్' మూవీతో బెస్ట్ డైరెక్టర్‌గా నేషనల్ అవార్డ్ అందుకున్నాడు.
![]() |
![]() |