![]() |
![]() |

మహానటుడు నందమూరి తారక రామారావు.. టైటిల్ లో `రాముడు` ఉండేలా పలు చిత్రాలు చేశారు. వాటిలో అనేక సినిమాలు విజయపథంలో పయనించాయి. 1962 నాటి `టైగర్ రాముడు` కూడా ఆ జాబితాలోదే. ఇందులో దొంగగా విభిన్నమైన పాత్రలో ఆకట్టుకున్నారు తారక రాముడు. ఎన్టీఆర్ తో ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు సీఎస్ రావు ఈ సినిమాని రూపొందించారు. ఎన్టీఆర్ కి జంటగా రాజ సులోచన నటించిన ఈ చిత్రంలో ఎస్వీ రంగారావు, రేలంగి, సీఎస్ఆర్, గిరిజ, హేమలత, సంధ్య, మాస్టర్ నాగరాజు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
Also Read: ఫ్లాప్ డైరెక్టర్ తో బాలయ్య సినిమా.. నిర్మాతగా `దిల్` రాజు!?
దిగ్గజ నేపథ్యగాయకులు ఘంటసాల సంగీతమందించిన ఈ సినిమాకి సముద్రాల జూనియర్ సాహిత్యమందించారు. ఇందులోని ``వరూధిని ప్రవరాఖ్యుడు``, ``నవ భావనలు``, ``ఎన్ని దినాలకు వింటినిరా``, ``ఉలకక పలకక``, ``చందమామ లోకంలో``, ``ఆశ దురాశ``, ``హాయి హాయి హాయి`` వంటి పాటలు రంజింపజేశాయి. శ్రీ శ్రీనివాస ప్రొడక్షన్స్ పతాకంపై పంతం చిన్నారావు, వడ్డి శ్రీరాములు సంయుక్తంగా నిర్మించిన `టైగర్ రాముడు`.. 1962 మార్చి 8న విడుదలైంది. నేటితో ఈ చిత్రం 60 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |