![]() |
![]() |

ఉత్తరాదిలో ఈ రోజు పండగ రోజు. పెళ్లైన మహిళలు భర్త బాగు కోసం ఉపవాసాలు ఉండే రోజు. సాయంత్రం చంద్రుడికి పూజలు చేసి, జల్లెడ నుంచి చందమామను చూస్తారు. దీనిని ‘కర్వా చౌత్’ అంటారు. ఇటీవల పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ ఈ రోజు తొలి కర్వా చౌత్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పెళ్లైన ఉత్తరాది కథానాయికలు చాలామంది సెలబ్రేట్ చేసుకుంటారు.
సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు జంటగా ‘భరత్ అనే నేను’, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌కి జోడీగా ‘వినయ విధేయ రామ’ సినిమాల్లో నటించిన కియారా అద్వానీకి ఇంకా పెళ్ళి కాలేదు. కానీ, ఆమె కర్వా చౌత్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. అదెలా అంటారా? కర్వా చౌత్ కోసం వివాహితలు ప్రత్యేకంగా గోరింటాకు పెట్టుకుంటారు. తన తల్లికి కియారా గోరింటాకు పెట్టారు. ప్రజెంట్ బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయినప్పటికీ తల్లికి గోరింటాకు పెట్టడం స్పెషల్ ఫీలింగే కదా!
సినిమాలకు వస్తే... అక్షయ్‌కుమార్‌కి జంటగా కియారా నటించిన సినిమా ‘లక్ష్మీ’. రాఘవ లారెన్స్ డైరెక్షన్ చేశారు. దీపావళి కానుకగా ఈ నెల 9ప డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ కానుంది. ఇది సౌత్‌లో హిట్టయిన ‘కాంచన’కి రీమేక్.
![]() |
![]() |