![]() |
![]() |

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'అల్లుడు అదుర్స్'. నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ నాయికలుగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌లో సోనూ సూద్ ముఖ్య పాత్రలో దర్శనమివ్వనున్నారు. 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే... ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ప్రత్యేక గీతాన్ని హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో సాయిశ్రీనివాస్, సోనూసూద్, బిగ్ బాస్ సీజన్ 4 బ్యూటీ మోనాల్ గజ్జర్ పై చిత్రీకరించిన యూనిట్.. ప్రస్తుతం కశ్మీర్ లో చివరి పాటని షూట్ చేస్తున్నారు. 'అల్లుడు అదుర్స్' లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అంశాల్లో ఈ గీతానికి కూడా స్థానముందట.
మరి.. 'రాక్షసుడు' వంటి విజయవంతమైన చిత్రం తరువాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నుంచి వస్తున్న 'అల్లుడు అదుర్స్' కూడా అదే బాట పడుతుందేమో చూడాలి.
![]() |
![]() |