![]() |
![]() |

కొద్ది రోజుల క్రితం అజయ్ దేవ్‌గణ్ డైరెక్షన్‌లో 'మేడే' అనే మూవీ రానున్న విషయాన్ని తెలుగువన్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. 'సత్యాగ్రహ' (2013) తర్వాత వారు కలిసి నటించే సినిమా ఇదే. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో హీరోయిన్‌గా కన్ఫామ్ అయ్యింది. అజయ్ పైలట్‌గా నటించే ఈ సినిమాలో ఆయన కో-పైలట్‌గా రకుల్ ఈ మూవీలో ఓ ఇంపార్టెంట్ రోల్ చేయనున్నది.
'మేడే'లో నటించడానికి తాను సంతకం చేసిన విషయాన్ని ధ్రువీకరించిన రకుల్, "నేను నటిగా చిత్రసీమలో అడుగుపెట్టాక, మిగతా అందరు యాక్టర్ల మాదిరిగానే ఏదో ఒకరోజు అమితాబ్ బచ్చన్‌తో నటించాలని కలలు కనేదాన్ని. మేడే నా కలను నిజం చేస్తోంది" అని చెప్పింది. 'దే దే ప్యార్ దే' (2019) తర్వాత మరోసారి అజయ్ దేవ్‌గణ్‌తో కలిసి నటించనుండటంపైనా ఆమె ఆనందం వ్యక్తం చేసింది. ఈసారి ఆయన డైరెక్టర్ కూడా కావడంతో థ్రిల్ ఫీలవుతున్నాననేది ఆమె మాట. డిసెంబర్‌లో ఈ సినిమా హైదరాబాద్‌లో సెట్స్ మీదకు వెళ్లనున్నది. సింగిల్ షెడ్యూల్‌లో ఈ మూవీని పూర్తి చేయాలని దేవ్‌గణ్ ప్లాన్ చేస్తున్నాడు.
![]() |
![]() |