![]() |
![]() |

ఏప్రిల్ 23.. తెలుగునాట రెండు ఆసక్తికరమైన చిత్రాల మధ్య పోటీకి వేదిక కానుంది. అందులో ఒకటి స్ట్రయిట్ పిక్చర్ కాగా.. మరొకటి డబ్బింగ్ బొమ్మ. ఆ సినిమాలే.. `టక్ జగదీష్`, `తలైవి`.
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా `మజిలీ` దర్శకుడు శివ నిర్వాణ రూపొందించిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ `టక్ జగదీష్` ఏప్రిల్ 23న థియేటర్స్ లోకి రానుండగా.. అదే రోజు బాలీవుడ్ క్వీన్, `నేషనల్ అవార్డ్స్` విన్నర్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన `తలైవి` రాబోతోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటీమణి స్వర్గీయ జయలలిత బయోపిక్ గా తెరకెక్కిన `తలైవి`ని తమిళ, హిందీ, తెలుగు భాషల్లో విజయ్ తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాలు కూడా ప్రచార చిత్రాలతో జనాల్లో ఆసక్తిని రేకెత్తించాయి.
మరి.. తెలుగునాట `నాని వర్సెస్ కంగనా` అన్నట్లుగా ఉన్న ఏప్రిల్ 23 బాక్సాఫీస్ పోరులో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.
కాగా, `టక్ జగదీష్`కి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించగా.. `తలైవి`కి టాలెంటెడ్ కంపోజర్ జీవీ ప్రకాశ్ స్వరకల్పన చేశారు.
![]() |
![]() |