![]() |
![]() |

మెలోడీబ్రహ్మ మణిశర్మ వారసుడిగా స్వరంగేట్రం చేశాడు మహతి స్వరసాగర్. `ఛలో`, `భీష్మ` చిత్రాలతో మంచి విజయాలను అందుకుని.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్
కంపోజర్.. పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వాటిలో `అంధాధున్` రీమేక్ `మాస్ట్రో` ఒకటి. యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో నభా నటేశ్ నాయికగా నటిస్తుండగా తమన్నా నెగెటివ్ టచ్ ఉన్న రోల్ లో దర్శనమివ్వనుంది. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూన్ 11న రిలీజ్ కానుంది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. `మాస్ట్రో` కంటే వారం రోజుల ముందు మణిశర్మ సంగీతసారథ్యంలో రూపొందిన `రిపబ్లిక్` రిలీజ్ కానుంది. `సుప్రీమ్` హీరో సాయితేజ్ కథానాయకుడిగా దేవా కట్టా
రూపొందిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్.. జూన్ 4న థియేటర్స్ లో సందడి చేయనుంది. మరి.. వారం రోజుల గ్యాప్ లో రాబోతున్న ఈ తండ్రీతనయుల చిత్రాలు.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో
చూడాలి.
![]() |
![]() |