![]() |
![]() |

మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఒకే ఏడాది సమ్మర్ సీజన్ లో సందడి చేసిన సందర్భం ఇప్పటివరకు లేదనే చెప్పాలి. త్వరలోనే ఆ ముచ్చట తీరబోతుందని సమాచారం.
వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న మెసేజ్ ఒరియెంటెడ్ సోషల్ డ్రామా ఆచార్యని 2021 వేసవిలో విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది కూడా. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ కూడా వేసవి ఆరంభంలో థియేటర్స్ లో సందడి చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఒకవేళ వకీల్ సాబ్ ముందే వచ్చినా అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ వేసవి చివరలో రిలీజ్ అయ్యే స్కోప్ ఉందని అంటున్నారు. మొత్తమ్మీద.. 2021 వేసవికి చిరు, పవన్ సందడి పక్కా అన్నమాట.
మరి.. 2021 సమ్మర్ సీజన్ లో మెగా బ్రదర్స్ ఏ రేంజ్ లో కాసుల వర్షం కురిపిస్తారో చూడాలి.
![]() |
![]() |