![]() |
![]() |

తెలుగు టెలివిజన్‌పై యాంకర్‌గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రదీప్ మాచిరాజు సినిమా హీరోగానూ తన సత్తా చాటుతున్నాడు. అతను హీరోగా పరిచయమైన '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' చిత్రం బాక్సాఫీస్ దగ్గర అంచనాలకు అనుగుణంగా వసూళ్లను రాబడుతోందని విశ్లేషకులు తెలియజేస్తున్నారు. శుక్రవారం జనవరి 29న విడుదలైన ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లోనే బ్రేకీవెన్ సాధించేసింది.
ఫణి ప్రదీప్ అలియాస్ మున్నా డైరెక్టర్‌గా పరిచయమైన '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' మూవీలో హీరోయిన్‌గా అమృతా అయ్యర్ నటించింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ. 4.8 కోట్లకు అమ్ముడుపోయాయి. ఫస్టాఫ్ బోరింగ్‌గా, సెకండాఫ్ ఓవర్ మెలోడ్రామాగా ఉందని టాక్ వచ్చినప్పటికీ విడుదలైన మొదటి నాలుగు రోజుల్లోనే రూ. 7 కోట్ల గ్రాస్, రూ. 4.95 కోట్ల షేర్ వచ్చిందంటున్నారు. తొలి మూడు రోజుల్లోనే నైజాం, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల ఏరియాలు సేఫ్ అవగా, సోమవారంతో మిగతా ఏరియాల్లోనూ బ్రేకీవెన్ వచ్చిందని సమాచారం.
శుక్రవారం రూ. 1.69 కోట్లు, శనివారం రూ. 0.96 కోట్లు, ఆదివారం రూ. 1.57 కోట్లు, సోమవారం 0.73 కోట్ల షేర్ సాధించింది ఈ సినిమా. కరోనా టైమ్‌లో ప్రదీప్ హీరోగా పరిచయమైన చిత్రానికి ఈ స్థాయి వసూళ్లు రావడం గొప్ప విషయమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎస్వీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్వీ బాబు నిర్మించిన ఈ మూవీని జీఏ2-యువి క్రియేషన్స్ సంయుక్తంగా డిస్ట్రిబ్యూట్ చేశాయి. సో.. తొలి సినిమాతోటే నిర్మాతలకు లాభాలు తెచ్చిన హీరో అయ్యాడు ప్రదీప్.
![]() |
![]() |