![]() |
![]() |

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న మీద పక్షి ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'కొండపొలం' నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అడవుల నేపథ్యంలో నడిచే కథ. అందుకని, హైదరాబాద్ దగ్గరలో ఉన్న వికారాబాద్ ఫారెస్ట్, అనంతగిరి హిల్స్ లో చిత్రీకరణ చేశారు. శీతాకాలంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పక్షులు ఇక్కడికి వస్తాయని, చిత్రీకరణ చేయడం వలన అవి రావడానికి ఆటంకం ఏర్పడిందని, దీని వల్ల బర్డ్ ఎకోసిస్టమ్ మీద ఎఫెక్ట్ ఉంటుందని, పైగా క్రిష్ యూనిట్ అడవులను నాశనం చేశారని కొంతమంది పర్యావరణ, పక్షి ప్రేమికులు ఆరోపించారు. ఆగ్రహం వ్యక్తం చేశారు.
పక్షి ప్రేమికుల ఆరోపణలను నిర్మాత రాజీవ్ రెడ్డి ఖండించారు. ప్రకృతిని నాశనం చేయకుండా చిత్రీకరణ చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రతిరోజూ చిత్రీకరణలో ఇద్దారూ కానిస్టేబుల్స్ ఉంటున్నారని ఆయన తెలిపారు. విమర్శలు చేస్తున్న ప్రతి ఒక్కరికీ అటవీ అధికారుల నుండి తీసుకున్న అనుమతులు చూపించలేమని ఆయన అన్నారు.
సినిమా విడుదలైన తరవాత కథ, పాత్రల చిత్రణ తదితర అంశాల మీద విమర్శలు రావడం సహజమే. చిత్రీకరణలో ఉండగా విమర్శలు రావడం అరుదు అని చెప్పుకోవాలి. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ 'పద్మావత్' తెరకెక్కిస్తున్నప్పుడు కర్ణిసేన గొడవ చేసింది. అదీ కథ మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ! రాణి పద్మావతిని కించపరిచేలా చూపిస్తే ఊరుకోమని! క్రిష్ సినిమాపై వస్తున్న విమర్శలు వాటికి భిన్నమైనవి. పర్యావరణానికి హాని చేస్తున్నారని వచ్చాయి.
![]() |
![]() |