![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఇలా మెగా కాంపౌండ్ లోని అగ్ర కథానాయకులంతా కేవలం 50 రోజుల్లో తమ తమ చిత్రాలతో సందడి చేస్తే..! మెగాభిమానులకు ఆ కిక్కే వేరుగా ఉంటుంది కదా! మెగా క్యాంప్ టాప్ స్టార్స్ ఇస్తున్న ఈ `నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్` ఆఫర్.. రైట్ నౌ టాక్ ఆఫ్ టాలీవుడ్ అవుతోంది మరి. డిసెంబర్ 17 - ఫిబ్రవరి 4.. ఇలా సరిగ్గా 50 రోజుల వ్యవధిలో ఈ నలుగురు `మెగా కాంపౌండ్` స్టార్స్ నటిస్తున్న సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అది కూడా.. అధికారిక ప్రకటనలతోనే.
ఆ వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ 17న బన్నీ నటిస్తున్న పాన్ - ఇండియా మూవీ `పుష్ప - ద రైజ్` విడుదల కానుండగా.. జనవరి 7న చరణ్ నటిస్తున్న మరో పాన్ - ఇండియా ప్రాజెక్ట్ `ఆర్ ఆర్ ఆర్` తెరపైకి రానుంది. ఇక జనవరి 12న పవన్ నటిస్తున్న మాలీవుడ్ రీమేక్ `భీమ్లా నాయక్` సందడి చేయనుండగా.. ఫిబ్రవరి 4న చిరు టైటిల్ రోల్ లో నటిస్తున్న `ఆచార్య` తెరపైకి రాబోతోంది. మొత్తమ్మీద.. 50 డేస్ లో 4 క్రేజీ `మెగా` ప్రాజెక్ట్స్ సిల్వర్ స్క్రీన్ పైకి రానుండడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.
మరి.. ఈ నాలుగు చిత్రాలు కూడా సకాలంలో విడుదలవుతాయా లేదా ఏవైనా వాయిదా పడతాయా అన్నది చూడాలి. ఒకవేళ అన్నీ అనుకున్న తేదిలకే విడుదలైతే.. ఏయే చిత్రాలు బాక్సాఫీస్ ముంగిట సెన్సేషన్ క్రియేట్ చేస్తాయన్నది కూడా ఆసక్తికరమే. చూద్దాం.. ఏం జరుగుతుందో!
![]() |
![]() |