![]() |
![]() |

అఖిల్ అక్కినేని హీరోగా అగ్ర దర్శకుల్లో ఒకరైన సురేందర్ రెడ్డి 'ఏజెంట్' అనే మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. చూస్తుంటే ఈ సినిమాతో ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నంత కసిగా కనిపిస్తున్నాడు అఖిల్. టైటిల్ రోల్‌లో ఇమిడిపోవడం కోసం అతను ఎంతగా కష్టపడుతున్నాడో తెలియజేసే ఒక బిహైండ్ ద సీన్ పిక్చర్‌ను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు సురేందర్ రెడ్డి. ఆ పిక్చర్‌లో అఖిల్ జిమ్‌లో ఉన్నాడు. ముఖం చూపించకుండా, వీపు మాత్రమే చూస్తున్నాడు. సన్నని నడుము, విశాలమైన పైభాగంతో కండలు తిరిగి అమేజింగ్ ఫిజిక్‌తో కనిపిస్తున్నాడు. ఇప్పటిదాకా కనిపించని సరికొత్త అవతారంతో, 'ఏజెంట్'లో యాక్షన్ హీరోగా మనముందుకు రానున్నాడు అఖిల్. వీపుపై ఒక టాటూ కనిపిస్తూ హ్యాండ్సమ్ బీస్ట్ లాగా ఉన్నాడు.
ఈ ఫిల్మ్‌తో అఖిల్‌ను సమ్‌థింగ్ స్పెషల్‌గా చూపిస్తానని ఫ్యాన్స్‌కు ప్రామిస్ చేశాడు సురేందర్ రెడ్డి. అఖిల్ ఫొటోను షేర్ చేసిన ఆయన, "ఇది కేవలం బిగినింగ్. మీకు ముందు ముందు ఉంది పండగ." అంటూ రాసుకొచ్చాడు. ఇంత దాకా పక్కింటి అబ్బాయి తరహా క్యూట్ క్యారెక్టర్స్‌లో కనిపించిన అఖిల్‌ను ఇలా బీస్ట్ తరహా మాస్ లుక్‌లో చూసేసరికి ఫ్యాన్స్ ఆనందం పట్టలేకపోతున్నారు. సురేందర్ రెడ్డి షేర్ చేసిన ఫొటోపై 'ఏజెంట్ లోడింగ్' అనే హ్యాష్ ట్యాగ్‌తో పాటు, "వైల్డ్ రైడ్‌కి మీరు రెడీగా ఉన్నారా?" అనే ప్రశ్న కూడా కనిపిస్తోంది.

వక్కంతం వంశీ స్క్రిప్ట్ సమకూర్చిన ఈ యాక్షన్ డ్రామాలో గూఢచారి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయబోతున్నాడు అఖిల్. సాక్షి వైద్య హీరోయిన్‌గా పరిచయమవుతోంది. తమన్ మ్యూజిక్ సమకూరుస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి.
ప్రస్తుతం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు అఖిల్. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేశాడు.
![]() |
![]() |