![]() |
![]() |
.jpg)
పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్ ఇంతవరకు తల్లిపాత్రలో కనిపించిన సందర్భాలు దాదాపుగా లేవనే చెప్పాలి. త్వరలో ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.. అమ్మ వేషంలో దర్శనమివ్వనుందట. ఆ వివరాల్లోకి వెళితే.. రీసెంట్ గా కాజల్ ఓ హారర్ థ్రిల్లర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. 'రౌడీ బేబి' అనే పేరుతో తెరకెక్కనున్న ఈ తమిళ సినిమా.. తల్లీకూతుళ్ళ సెంటిమెంట్ నేపథ్యంలో సాగుతుందట.
కథానుసారం.. ఓ పాపకి తల్లిగా టాలీవుడ్ చందమామ కనిపించనుందట. అంతేకాదు.. ఇందులో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా ఓ ముఖ్య పాత్రలో నటించనుందంటూ ప్రచారం సాగుతోంది. శరవణన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. మరి.. తల్లి పాత్రలో కాజల్ ఏ స్థాయిలో మెస్మరైజ్ చేస్తుందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, ప్రస్తుతం కాజల్ చేతిలో మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య', కింగ్ నాగార్జున - ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ మూవీ ఉన్నాయి. అలాగే తమిళంలో 'హే సినామిక', 'ఘోస్టీ', డీకే డైరెక్టోరియల్ చేస్తోంది. అదేవిధంగా.. హిందీలో 'ఉమ' అనే ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ కూడా ఉంది.
మొత్తమ్మీద.. పెళ్ళయ్యాక కూడా అదే జోరుని కొనసాగిస్తూ వార్తల్లో నిలుస్తోంది కాజల్ అగర్వాల్.
![]() |
![]() |