![]() |
![]() |

వరుసగా అగ్ర కథానాయకులతోనే సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ). త్వరలో ఈ యంగ్ కెప్టెన్.. మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయనున్నాడు. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ ఏడాది చివరలోపు పట్టాలెక్కనుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించబోతున్నట్లు కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. తాజాగా ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని కన్ఫామ్ చేశాడు బాబీ.
అంతేకాదు.. ఇప్పటికే ఓ పాట రికార్డ్ కాగా.. దాన్ని విని మెగాస్టార్ కూడా ఎంతో ఇంప్రెస్ అయ్యారట. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. మెగాస్టార్ తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లోనూ బాబీ ఒక సినిమా చేశాడు. `సర్దార్ గబ్బర్ సింగ్` పేరుతో రూపొందిన ఈ సినిమాకి కూడా దేవి శ్రీ ప్రసాదే బాణీలు అందించాడు. పాటల పరంగా `సర్దార్` ఓకే అనిపించుకున్నప్పటికీ.. సినిమా పరంగా నాట్ ఓకే అనిపించుకుంది.
మరి.. తమ్ముడు పవన్ కాంబినేషన్ లో అచ్చిరాని `డీఎస్పీ` ఫ్యాక్టర్.. అన్నయ్య చిరు కాంబినేషన్ లోనైనా బాబీకి కలిసొస్తుందేమో చూడాలి. త్వరలోనే చిరు - బాబీ ఫస్ట్ జాయింట్ వెంచర్ కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
![]() |
![]() |