![]() |
![]() |

'సైరా నరసింహారెడ్డి' సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ తమన్నాపై ఒక పాట తెరకెక్కించారు. అయితే, ఆ పాట సినిమాలో ఉండదు. కథకు అడ్డు తగులుతుందని తీసేశారు. తరవాత కూడా రిలీజ్ చేయలేదు. దాంతో పాటలో చిరంజీవి, తమన్నా జోడీ స్టెప్పులను చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కలేదు. మరి, ఈసారైనా కుదురుతుందో? లేదో?
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా నటిస్తున్న సినిమా 'ఆచార్య'. ఇందులో రెండు స్పెషల్ సాంగ్స్ ఉన్నాయట. ఒక పాటలో చిరుతో కలిసి స్టెప్పులు వేసే అవకాశం రెజీనాకి దక్కింది. ఆల్రెడీ ఆ పాటను షూట్ చేసేశారు కూడా! మరో పాటకు తమన్నాను తీసుకోవాలని అనుకుంటున్నారట. చిరంజీవి డాన్స్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. హీరోలతో సమానంగా స్టెప్పులు వేయగల హీరోయిన్ అని తమన్నాకు పేరుంది. వీళ్ళిద్దరూ కలిసి స్పెషల్ సాంగ్ చేస్తే 'అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడు' రేంజ్ ఉంటుందని ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మరి, కుదురుతుందో? లేదో? చూడాలి. వెయిట్ అండ్ సీ.
![]() |
![]() |