![]() |
![]() |

నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీగా రూపొందిన 'రాత్ అకేలీ హై' ఆన్‌లైన్‌లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. సస్పెన్స్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని ఇదివరకే ప్రకటించినట్లుగా ఇందులో అనేక సస్పెన్స్ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయి. కథలోని మిస్టరీని పోలీస్ ఇన్‌స్పెక్టర్ జతిల్ యాదవ్ ఎలా ఛేదించాడనేది చూడాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. నెట్‌ఫ్లిక్స్‌లో 'రాత్ అకేలీ హై' మూవీ జూలై 31న విడుదలవుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో నిర్మాతలు శుక్రవారం ట్రైలర్‌ను రిలీజ్ చేసి, సినిమాపై క్యూరియాసిటీని మరింతగా పెంచేశారు.
ఠాకుర్ రఘుబీర్ సింగ్ మరణంతో ట్రైలర్ మొదలయ్యింది. ఆయన స్థానికంగా పలుకుబడి ఉన్న ఒక జమీందార్. ఆయనను ఎవరో కిరాతకంగా హత్య చేస్తారు. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ బాధ్యత ఇన్‌స్పెక్టర్ జతిల్ యాదవ్‌పై పడుతుంది. అతను మొదట ఠాకుర్ ఫ్యామిలీ మెంబర్స్‌ను అనుమానిస్తాడు. ఆ తర్వాత ఆయనకు ఉంపుడుగత్తె అయిన రాధికా ఆప్టేను విచారిస్తాడు. మరోవైపు జతిల్ యాదవ్‌ను నిలువరించేందుకు ఎవరో ప్రయత్నాలు చేస్తుంటారు. మిస్టరీని జతిల్ ఎలా ఛేదించాడనేది క్లైమాక్స్. అతని క్యారెక్టర్‌లోనూ ట్విస్ట్‌లు ఉండేట్లు కనిపిస్తోంది. ఒక డార్క్ సీక్రెట్‌ను ఆధారం చేసుకొని తీసిన ఈ మూవీకి స్క్రీన్‌ప్లే ప్రధాన బలమని ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. అలాగే సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇంప్రెసివ్‌గా కనిపిస్తున్నాయి.
పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా నవాజుద్దీన్ సిద్దిఖి, ఠాకూర్ ఉంపుడుగత్తెగా రాధికా ఆప్టే నటన ప్రధాన ఆకర్షణ కానున్న ఈ మూవీలో తిగమాన్షు ధూలియా, శ్వేతా త్రిపాఠి, శివానీ రఘువంశీ, నిషాంత్ దహియా, ఇలా అరుణ్ కీలక పాత్రలు చేశారు. హనీ ట్రెహాన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని అభిషేక్ చౌబీ, రోనీ స్క్రూవాలా నిర్మించారు.
![]() |
![]() |