![]() |
![]() |

మెగా బ్రదర్ నాగబాబు నటి, పొలిటికల్ లీడర్ రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటీవీలో గత కొంత కాలంగా ప్రసారం అవుతున్న'జబర్దస్త్' కామెడీ షోలో ఏడేళ్ల పాటు రోజాతో కలిసి నాగబాబు జడ్జిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆ తరువాత మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో మనస్పర్థలు రావడంతో నాగబాబు `జబర్దస్త్` కామెడీ షోకి శాశ్వతంగా గుడ్‌బై చెప్పేశారు.
ఆ తరువాత జీ తెలుగులో 'అదిరింది' పేరుతో కామెడీ షో చేసినా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం సొంత యూట్యూబ్ ఛానల్‌ని ప్రమోట్ చేసుకుంటూ అందులో వరుస వీడియోలు పెడుతున్నారు. తనకు నచ్చని విషయాలపై, వ్యక్తులపై నేరుగా సెటైర్లు వేస్తున్నారు. ఆ మధ్య నందమూరి బాలయ్యపై ఘాటు వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించిన నాగబాబు తాజాగా రోజాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల తన అభిమానులతో ఇన్ స్టా వేదికగా చిట్ చాట్ చేసిన ఆయన రోజాని జబర్దస్త్ కమెడియన్ అనేశారు.
అభిమానులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా రోజా పేరుని చెప్పి షాకిచ్చారు. "జబర్దస్త్‌లో మీ ఫేవరేట్ కమెడియన్ ఎవర"ని ఓ అభిమాని అడిగితే, "ఇంకెవరు జడ్జి స్థానంలో కూర్చున్న రోజానే." అని టక్కున చెప్పేశారు. నాగబాబు కామెంట్‌పై మరి రోజా ఎలాంటి పంచ్ విసురుతారో చూడాలి అంటున్నారు నెటిజన్స్.
![]() |
![]() |