![]() |
![]() |

'బాహుబలి'లో శివగామి క్యారెక్టర్ చేయడం ద్వారా దేశవ్యాప్త సినీ ప్రియుల హృదయాల్ని గెలుచుకున్న సీనియర్ యాక్ట్రెస్ రమ్యకృష్ణ రాంగ్ రీజన్స్‌తో శనివారం వార్తల్లో నిలిచారు ఆమె కారులో మద్యం బాటిళ్లను చెన్నై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాల తనిఖీలో భాగంగా శనివారం రమ్యకృష్ణకు చెందిన TN07Q 0099 నంబర్‌తో ఉన్న ఇన్నోవా క్రిస్టా కారును చెన్నై పోలీసులు సోదా చేశారు. ఈ సందర్భంగా ఆ కారులో కనిపించిన 96 బీరు బాటిళ్లు, 8 లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకొని, కారును సీజ్ చేశారు. కారు డ్రైవర్ సెల్వకుమార్‌ను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని రమ్యకృష్ణకు తెలియజేశారు.
అందిన సమాచారం ప్రకారం పోలీసులు తనిఖీ చేసిన సమయంలో రమ్యకృష్ణ కారులో లేరు. మద్యాన్ని మమ్మలాపురమ్ నుంచి చెన్నైకి చేరవేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసుల కస్టడీ నుంచి డ్రైవర్‌ను బయటకు తీసుకు రావడానికి రమ్యకృష్ణ బెయిల్ కోసం అప్లై చేశారు. మద్యం బాటిళ్లను ఎవరి కోసం చేరవేస్తున్నారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. వాటిని రమ్యకృష్ణ లేదా ఆమె సంబంధీకులెవరైనా తెప్పించుకుంటున్నారా లేక డ్రైవరే తెచ్చుకుంటున్నాడా.. అనే విషయంపై పోలీసులు విచారిస్తున్నారు.
![]() |
![]() |