![]() |
![]() |

బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో నటసింహ నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 'సింహా', 'లెజెండ్' వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత ఆ ఇద్దరి కాంబినేషన్‌లో తయారవుతున్న మూడో సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్ షూటింగ్ జరిగింది. జూన్ 10 బాలయ్య 60వ పుట్టినరోజు సందర్భంగా ఆ ముందు రోజు రాత్రి రిలీజ్ చేసిన #BB3 First Roar టీజర్‌కు అనూహ్యమైన రెస్పాన్స్ రావడమే కాకుండా మూడు రోజుల పాటు నంబర్‌వన్ ప్లేస్‌లో ట్రెండ్ అవడం విశేషం. ఆ టీజర్‌లో బాలయ్య చెప్పిన డైలాగ్ అయితే వైరల్ అయ్యింది. దాన్ని బట్టి బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌కు ఎంతటి క్రేజ్ ఉందో ఊహించుకోవచ్చు.
కాగా, ఈ మూవీ కోసం సునీల్‌ను దృష్టిలో పెట్టుకొని కామెడీ ఎపిసోడ్స్‌ను బోయపాటి రాయించాడని సమాచారం. అయితే లాక్‌డౌన్‌తో షూటింగ్స్ ఆగిపోవడంతో స్క్రిప్ట్ మీద మరోసారి కూర్చున్న బోయపాటి కథకు సునీల్ పోర్షన్ లేకపోవడమే మంచిదని భావించాడనీ, అందుకని ఆ కామెడీ ఎపిసోడ్స్‌ను తీసేయించాడనీ ప్రచారం జరుగుతోంది. దాంతో పాటు స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు కూడా చేయించాడంటున్నారు. ఈ మూవీలో బాలయ్య రెండు క్యారెక్టర్లు చేస్తున్నాడు. టీజర్‌లో చూపించిన క్యారెక్టర్ ఒకటి అయితే, ఇంకొకటి అఘోరా క్యారెక్టర్ అని తెలుస్తోంది. మరోవైపు హీరోగా చేసిన సినిమాలు వరుసగా పల్టీలు కొట్టడంతో తిరిగి కమెడియన్ రోల్స్‌లోకి రావడం బెటర్ అని నిర్ణయించుకున్న సునీల్.. ఆ దిశగా తన కెరీర్‌ను కొనసాగించే యత్నాలు చేస్తున్నాడు.
![]() |
![]() |