Home  »  News  »  ఈ దేశంలో హిందువుగా పుట్ట‌టం క‌న్నా... నాగ‌బాబు మ‌రో సంచ‌ల‌నం!

Updated : Jun 13, 2020

 

మొన్నటికి మొన్న గాంధీని హ‌త్య‌చేసిన గాడ్సేని దేశ‌భ‌క్తుడ‌ని పొగిడి వార్త‌ల్లో నిలిచిన మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు, నిన్న‌టికి నిన్న‌ హీరో బాల‌కృష్ణ మీద ఫైర‌య్యి, ఆయ‌న‌ను నోటిని అదుపులో పెట్టుకోమ‌ని హెచ్చ‌రించ‌డం ద్వారా వివాదాన్ని సృష్టించారు. ఇప్పుడు దేశంలో హిందువుల మీద జ‌రుగుతున్న దాడుల మీద ఆగ్ర‌హంతో ఊగిపోయారు. కాశ్మీర్‌లో అజ‌య్ అనే పండిట్ హ‌త్య‌కు గురైన ఉదంతంపై స్పందిస్తూ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో వ‌రుస ట్వీట్‌ల‌తో మ‌రోసారి వార్త‌ల‌కెక్కారు. ఈ సంద‌ర్భంలో ఈ దేశంలో హిందువుగా పుట్ట‌టం క‌న్నా ఒక గాడిద‌గా పుట్ట‌టం బెట‌ర్ అని ఎవ‌రో అన్న మాట‌ను కోట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

మొద‌ట‌గా, "నాకు నిన్నే తెలిసింది కాశ్మీర్ లో ఒక హిందు పండిట్ అజయ్ అనే సర్పంచి ని చంపేశారు. పరవాలేదు చచ్చింది హిందూ పండిట్ కదా. చస్తే మనం ఎవరం ఫీల్ అవ్వక్కరలేదు. ఎక్కడో కాశ్మీరీ పండిట్, మన చుట్టం కాదు, మన స్టేట్ కాదు.. ఎక్కడో లయాడ్ అనే నల్లజాతి వ్యక్తి ని చంపితే ఇండియాలో కూడా స్పందించారు. కానీ ఇది ఇండియా కదా.. ఈ సో కాల్డ్ మీడియా, సెక్యూలరిస్టులు స్పందించక్కరలేదు. కనీసం హిందువులకి, హిందూ సంస్థల కయినా బాధ్యత ఉండాలి కదా. మన రక్తం గడ్డ కట్టుకొని పోయింది. ఈ దేశం లో హిందువు గా పుట్టటం కన్నా ఒక గాడిద గా పుట్టటం బెటర్ అని ఎవరో మహానుభావుడు అన్న మాట నిజమేమో అనిపిస్తుంది" అని ఆయ‌న పోస్ట్ చేశారు.

అంత‌టితో ఆయ‌న ఆగ‌లేదు. "మొన్న కొందరు సాధువులని చంపేశారు. ఇలా మెయిన్ స్ట్రీమ్ మీడియా కావాలని కవర్ చెయ్యని హిందువుల హత్యలు ఎన్నో.. అజయ్ హత్యకి కారకులని urgent ga పట్టుకొని వాళ్ళని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. హిందు మతం, హిందువుల నమ్మకాలు, హిందువుల సంస్కృతి, ఇలాగే నాశనము అయ్యేవరకు అందరం ఇలాగే ఉందాం." అని వ్యంగ్యంగా రాసుకొచ్చారు.

ఆ త‌ర్వాత ఎప్ప‌ట్నుంచి హిందువులు ఎవ‌రెవ‌రి పాల‌న‌లో ఇబ్బందులు ప‌డుతూ వ‌చ్చారో లెక్క‌లు చెప్పారు. "నాకు తెలిసి హిందు దేశంలో ఆఖరి హిందువు చక్రవర్తి సామ్రాట్ పృథ్విరాజ్. ఇంకా అక్కడ్నుంచి మనం మహమ్మదీయ చక్రవర్తుల పాలనలో నలిగి పోయాం, బ్రిటిష్ పాలనలో నలిగిపోయాం, స్వతంత్రమ్ వచ్చాక కూడా బ్రిటిష్ ఏజెంట్ల పాలనలో నలిగిపోయాం. ఇప్పుడిప్పుడే అన్ని మతాలను సమానం గా చూసే ఒక పార్టీ పాలనలో ఉన్నాం. కానీ వీళ్లు కూడా మీనమేషాలు లెక్కిస్తున్నట్లు గా ఉంది. lets save hinduism hindu culture. Plz dear modiji plz consider, we give equal rights and equal limits to all religions. no vote bank politics." అంటూ భారీ పోస్ట్ పెట్టారు.

సోష‌ల్ మీడియాలో నాగ‌బాబు పోస్టుల‌ను బ‌ట్టి చూస్తుంటే ఆయ‌న మునుప‌టి సౌమ్యుడైన నాగ‌బాబు కాద‌నీ, త‌న‌కంటూ భావ‌జాలాన్ని ఏర్పాటుచేసుకొని దానికి అనుగుణంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వ్య‌క్తిగా అర్థ‌మ‌వుతోంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. హిందూ భావ‌జాలాన్ని అణువ‌ణువునా ఒంట‌బ‌ట్టించుకున్నందు వ‌ల్లే ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు, పోస్టులు ఆయ‌న పెడుతున్నార‌ని వారు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో నాగ‌బాబు ఇంకెన్ని సంచ‌ల‌నాత్మ‌క మాట‌లు చెబుతారో వేచి చూడాల్సిందే...

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.