![]() |
![]() |

రామ్ గోపాల్ వర్మ తీసిన 'నగ్నం' (నేక్డ్) సినిమాలో అంగాంగ ప్రదర్శనతో వార్తల్లో నిలిచిన శ్రీ రాపాక తాజాగా కాత్యాయని అనే మూవీ చేస్తున్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై పరమేశ్ బొగ్గుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయిరాజేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేశారు.
శ్రీ రాపాక మాట్లాడుతూ, "మూడు సంవత్సరాల క్రితమే సాయి రాజేష్ ఈ కథ చెప్పాడు. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. అందరికీ నచ్చుతుంది. ప్రొడ్యూసర్ పరమేష్ గారు ఒక 60 విలేజెస్ లో హాస్పటల్స్ కట్టి ప్రజలకు హెల్ప్ చేస్తున్నారని తెలిసి ఆయన కోసం ఈసినిమా చెయ్యలనుకున్నాను. నాకు ఆర్జీవి గారు మంచి లైఫ్ ఇచ్చారు.. ఆయనకి నా థాంక్స్" అన్నారు.
దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ, "ఇది 1990లోజరిగే లవ్ స్టొరీ. 2020లో జరిగే మూడు ప్రేమకథల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.. వాటిని కాత్యాయని ఎలా డీల్ చేసింది అనేది మెయిన్ కాన్సెప్ట్. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్లో శ్రీ రాపాక నటిస్తోంది. లవ్, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం" అన్నారు.

![]() |
![]() |