![]() |
![]() |

"సినిమా పరిశ్రమలోకి రావాలని చాలా మందికి ఉంటుంది. కానీ ఇక్కడ ఇమడాలంటే ఒక ప్రధాన లక్షణం ఉండాలి." అంటున్నారు అనుష్క శెట్టి. బొద్దుగా తయారైనప్పటికీ 39 ఏళ్ల వయసులోనూ చెక్కుచెదరని అందంతో కనిపించే ఆమె ఇంకా బ్యాచిలరెట్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. "నేను జీవితంలో దేన్నీ ప్లాన్ చేసుకోను. కానీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాక దాని అంతు చూడకుండా వదిలిపెట్టను." అని ఆమె తెలిపారు.
సినిమా పరిశ్రమ గురించి కూడా చాలా బాగా ఆలోచించే అడుగుపెట్టారామె. "ఈ ఇండస్ట్రీ బయటకు చూడ్డానికి అత్యంత గ్లామరస్‌గా అనిపిస్తుంది. అందులో ఉన్నవారందరూ చాలా కంఫర్టబుల్‌గా సుఖపడుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ వెలుగుల కోసం అహర్నిశలు కష్టపడతారన్న విషయాన్ని గుర్తించాలి. షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు ఎప్పుడు తింటారో, ఎన్ని గంటలు పడుకుంటారో వారికి కూడా తెలీదు. యాక్టర్లు ఆ శ్రమను ముఖంపై చూపించకూడదు. సెలక్ట్ చేసుకున్న క్యారెక్టర్‌కు న్యాయం చేయగలగాలి. ఈ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలనుకొనేవాళ్లు ఎవరైనా సరే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను నమ్మిన సూత్రం ఇదే." అని చెప్పారు అనుష్క.
![]() |
![]() |