![]() |
![]() |

యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య ఇప్పటివరకు 18 సినిమాలతో సందడి చేశారు. వీటిలో రెండే రెండు సందర్భాల్లో మాత్రమే తన లక్కీ డైరెక్టర్స్ తో సెకండ్ టైమ్ వర్క్ చేశారు. 'ఏ మాయ చేశావే' లాంటి విజయవంతమైన చిత్రం తరువాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 'సాహసం శ్వాసగా సాగిపో' చేశారు చై. అలాగే 'ప్రేమమ్' వంటి క్లాస్ హిట్ తరువాత చందు మొండేటి డైరెక్షన్ లో 'సవ్యసాచి' చేశారు. గమనించదగ్గ అంశమేమంటే.. ఆయా దర్శకులతో చేసిన ఈ సెకండ్ ఎటెంప్ట్స్ కూడా బాక్సాఫీస్ వద్ద డిజప్పాయింట్ చేశాయి.
కట్ చేస్తే.. ముచ్చటగా మూడోసారి అలాంటి ప్రయత్నమే మరొకటి చేస్తున్నారు చై. ఈ సారి 'మనం' వంటి మెమరబుల్ మూవీని అందించిన విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ఈ సెకండ్ ఎటెంప్ట్ చేస్తున్నారు. 'థాంక్యూ' పేరుతో రూపొందుతున్న ఈ క్రేజీ వెంచర్ 2021లో సందడి చేయనుంది. మరి.. ఈ సారైనా సెంటిమెంట్ బ్రేక్ చేసి కలిసొచ్చిన దర్శకుడితో రెండోసారి కూడా చైతూ సక్సెస్ ఫీట్ ని రిపీట్ చేస్తారేమో చూడాలి.
![]() |
![]() |