![]() |
![]() |
ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అయితే దాన్ని గుర్తించి కృషి చేస్తే తప్పకుండా వారి టాలెంట్‌కి తగిన గుర్తింపు లభిస్తుంది. ఈరోజుల్లో టాలెంట్ ఉంటే దానితో పాపులర్ కావడం చాలా ఈజీ. ప్రస్తుతం సోషల్ మీడియా ఎంత పవర్‌ఫుల్‌గా పనిచేస్తోందో అందరికీ తెలిసిందే. ఎక్కడో మారు మూల గ్రామంలో ఉన్న వారు సైతం సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీస్‌గా మారిపోతున్నారు. అలా తన డైలాగ్‌తో సెలబ్రిటీగా మారిపోయారు షేక్ అహ్మద్ పాషా. అందరికీ కుర్చీ తాత పరిచయమైన పాషా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఇంట్రెస్టింగ్ టాపిక్ అయిపోయాడు. అతను చెప్పే డైలాగులు సినిమా డైలాగ్‌లను మించి ఉంటాయి అలా తాత చెప్పిన కుర్చీ మడతపెట్టి డైలాగ్ ఓ రేంజ్‌లో వైరల్ అయ్యింది. అతను చెప్పిన ఆ కుర్చీ డైలాగ్‌తో మహేష్‌బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమాలో ఓ పాటే పెట్టారంటే కుర్చీతాత ఎంత ఫేమస్సో అర్థం చేసుకోవచ్చు.
ఇటీవల ‘గుంటూరు కారం’ చిత్రంలోని కుర్చీని మడతపెట్టి సాంగ్‌కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇప్పుడీ పాటకు సంబంధించిన ప్రోమో వైరల్ అయిపోతోంది. దీనిపై స్పందించిన కుర్చీతాత.. తన డైలాగ్‌తో చేసిన పాటకు మహేష్‌బాబు లాంటి గొప్ప హీరో డాన్స్ చేయడం అనేది తన అదృష్టం అన్నాడు. అవకాశం వస్తే పాటలో ఒక్క చరణానికి అయినా డ్యాన్స్ వేయాలని ఉందని అంటున్నాడు. ‘గుంటూరు కారం’ మ్యూజిక్ డైరెక్టర్ తనను పిలిపించి.. కుర్చీ మడతపెట్టి డైలాగ్‌ను వాడుకుంటున్నానని చెప్పిన తనతో ఓ బైట్ కూడా తీసుకున్నారని తెలిపారు. అంతేకాదు తనకు ఆర్థిక సాయం చేశారని కుర్చీతాత చెబుతున్నాడు. అంతేకాదు, అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ చేయబోయే నెక్స్‌ట్ సినిమాలో తాను నటిస్తానని, తనకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నానని అంటున్నాడు.
![]() |
![]() |