![]() |
![]() |

వేసవిలో విడుదలైన పలు చిరంజీవి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. యముడికి మొగుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, బావగారూ బాగున్నారా.. ఇలా చిరు సెన్సేషనల్ హిట్స్ ఎన్నో ఈ సీజన్ లోనే సందడి చేశాయి. అలాంటి సమ్మర్ సీజన్ లో చిరు ఆఖరిసారిగా పలకరించింది 'అందరివాడు' సినిమాతోనే. 2005లో విడుదలైన ఈ మూవీ తరువాత వేసవిలో మళ్ళీ మెగాస్టార్ సినిమా రానేలేదు.
అయితే ఆ ముచ్చటని మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ వెంచర్ 'ఆచార్య' తీర్చబోతోంది. ఇప్పటికే 40 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ వెంచర్.. ఈ నెల 9 నుంచి మళ్ళీ సెట్స్ పైకి వెళ్ళనుంది. అంతేకాదు.. 2021 వేసవిలోనే 'ఆచార్య' ఆగమనం ఉంటుందని చిత్ర బృందం మరోసారి అధికారికంగా ప్రకటించేసింది. మరి.. పదహారేళ్ళ తరువాత మళ్ళీ వేసవి బరిలో దిగుతున్న మెగాస్టార్.. మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.
![]() |
![]() |