![]() |
![]() |

'మజిలీ', 'వెంకీ మామ'.. ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ చేస్తున్న చైతూ.. ఆపై 'మనం' దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్ లో 'థాంక్యూ' చేయనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఇదివరకెన్నడూ పోషించని పాత్రలో ఈ అక్కినేని బుల్లోడు సందడి చేయనున్నారని టాక్.
అంతేకాదు.. ఈ సినిమాలో చైతూకి జోడీగా ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారని సమాచారం. రకుల్ ప్రీత్ సింగ్, 'గ్యాంగ్ లీడర్' బ్యూటీ ప్రియా అరుళ్ మోహన్ తో పాటు మరో యువ కథానాయిక.. ఇందులో చైతూతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అదే గనుక నిజమైతే.. 'ప్రేమమ్' తరువాత మరోమారు ముగ్గురు హీరోయిన్లతో చైతూ నటించే సినిమా ఇదే అవుతుంది. 'ప్రేమమ్' లో శ్రుతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్ నాయికలుగా నటించిన సంగతి తెలిసిందే.
![]() |
![]() |