![]() |
![]() |

యస్.యస్. రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న భారీ ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్' (రౌద్రం రణం రుధిరం) షూటింగ్ సోమవారం (అక్టోబర్ 5) నుంచి తిరిగి మొదలవనున్నది. ఈ చిత్రీకరణలో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొంటాడని సమాచారం. తారక్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమా ఏడాది నుంచి మేకింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. మార్చి 25న రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్‌తో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. వాస్తవానికి ఈ ఏడాది జూలై 30న ఈ సినిమాని రిలీజ్ చేస్తామని గతేడాదే ప్రకటించారు. కానీ కరోనా మహమ్మారి దెబ్బకు జనవరి 2021కి పోస్ట్‌పోన్ చేశారు. ఇప్పుడు ఆ తేదీన కూడా 'ఆర్ఆర్ఆర్' వచ్చే అవకాశం కనిపించడం లేదు.
దాదాపు ఏడు నెలల తర్వాత షూటింగ్‌ను పునఃప్రారంభించేందుకు నిర్మాత డీవీవీ దానయ్య ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ టీజర్‌తో షూటింగ్‌ను స్టార్ట్ చెయ్యాలని రాజమౌళి డిసైడ్ చేసుకున్నట్లు వినిపిస్తోంది. గవర్నమెంట్ రూల్స్, రెగ్యులేషన్స్ అనుగుణంగా తారక్‌కు సంబంధించిన సీన్లను చిత్రీకరించనున్నారు. మార్చి 27న రామ్ చరణ్ బర్త్‌డేకి విడుదల చేసిన అతని క్యారెక్టర్ టీజర్‌కు అద్వితీయమైన రెస్పాన్స్ వచ్చింది.
అదే తరహాలో మే 20న తారక్ బర్త్‌డేకి అతని క్యారెక్టర్ టీజర్‌ను జక్కన్న రిలీజ్ చేస్తాడని ఆశించిన ఫ్యాన్స్.. అలా జరగకపోవడంతో తీవ్రంగా నిరాశ చెందారు. లాక్‌డౌన్ వల్ల టీజర్ కట్ చేయడం సాధ్యపడలేదని రాజమౌళి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు తారక్ ఫ్యాన్స్‌ను సంబరాల్లో ముంచెత్తేలా, అతని టీజర్‌కు సంబంధించిన షూటింగ్ మొదట పూర్తి చేయాలని రాజమౌళి నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకూ 'ఆర్ఆర్ఆర్'కు సంబంధించిన 60 శాతం షూటింగ్ పూర్తయింది. 2021 ఆరంభం నాటికి షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి, సమ్మర్‌లో మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రకని తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం, సెంథిల్‌కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
.jpg)
![]() |
![]() |