![]() |
![]() |
.jpg)
ఎనిమిది, తొమ్మిది దశకాల్లో తిరుగులేని శృంగార తారగా ఏకఛత్రాధిపత్యం వహించిన సిల్క్ స్మిత జీవితాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని 2011లో 'డర్టీ పిక్చర్' సినిమా వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్టయింది. అందులో విద్యా బాలన్ నటించారు. అయితే అది అఫిషియల్ బయోపిక్ కాదనేది చాలామంది వాదన. ఇప్పుడు అసలు సిసలు బయోపిక్‌కు రంగం సిద్ధమైంది. 'అవల్ అప్పడిదాన్' పేరుతో తమిళంలో రూపొందే ఈ సినిమాకు కె.ఎస్. మణికందన్ దర్శకత్వం వహించనున్నారు. 'కన్న లడ్డు తిన్న ఆసయ్యా' సినిమాతో ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. గాయత్రి ఫిలిమ్స్, మురళి సినీ ఆర్ట్స్ బ్యానర్లపై చిత్రా లక్ష్మణన్, హెచ్. మురళి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
.jpg)
నవంబర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా గురించి డైరెక్టర్ మణికందన్ మాట్లాడుతూ, "స్మితతో సరిపోలదగ్గ శృంగార తార ఇప్పటి దాకా రాలేదు. ఆమె పాత్రను పోషించడానికి, ఆమె పాత్రకు న్యాయం చెయ్యగల సరైన నటి కోసం మేం ప్రయత్నిస్తున్నాం. స్మిత సక్సెస్‌లో ప్రధాన పాత్ర పోషించినవి ఆమె మత్తు కళ్లే." అని చెప్పారు. ఈ సినిమా స్మిత జీవితంలో వెలుగులోకి రాని పలు అంశాల్ని స్పృశించనున్నది. స్మిత పాత్ర ఎవరిని వరిస్తుందో చూడాలి.
.jpg)
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో 1960 డిసెంబర్‌లో జన్మించిన స్మిత అసలు వడ్లపట్ల విజయలక్ష్మి. 35 సంవత్సరాల స్వల్ప వయసులో 1996 సెప్టెంబర్‌లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడి, అశేష అభిమానులను శోకసంద్రంలో ముంచెత్తారు స్మిత. కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి దక్షిణాది టాప్ యాక్టర్లు అందరితోనూ నటించిన ఆమె నిర్మాతగా మారి డబ్బులు పోగొట్టుకున్నారు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన దెబ్బల వల్ల కూడా ఆమె డిప్రెషన్‌కు లోనైందని చెప్పుకుంటారు.
.jpg)
![]() |
![]() |